ETV Bharat / state

'కొవిడ్ పరీక్షల పేరుతో అత్యవసర వైద్య సేవలు ఆపొద్దు'

కొవిడ్ పరీక్షల పేరుతో అత్యవసర వైద్య సేవలను ఆలస్యం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ హెచ్చరించారు. జీజీహెచ్​లో వైద్యసేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. అత్యవసర సేవలను ఆపొద్దని సూచించారు.

author img

By

Published : Jul 26, 2020, 3:36 PM IST

guntur joint collector dinesh kumar on ggh medical services
దినేశ్ కుమార్, గుంటూరు జేసీ

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యసేవలను వెంటనే అందించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కొవిడ్ పరీక్షల పేరుతో జాప్యం చేయవద్దని సూచించారు. అత్యవసర వైద్యసేవలను విస్మరించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుంటూరు సర్వజనాసుపత్రిలో 12 ఏళ్ల బాలిక మృతిచెందగా.. వైద్యసేవలు ఆలస్యం కావడం వల్లే చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్​లో మరింత జవాబుదారీతనంతో వైద్యసేవలు అందేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు. కరోనా పరీక్షల పేరుతో అమూల్యమైన వైద్య సమయాన్ని వృథా చేయడం భావ్యం కాదని జేసీ అభిప్రాయపడ్డారు. జీజీహెచ్​లో సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి...

'వైద్య సిబ్బందికి కనీసం గ్లౌజులు ఇవ్వకపోతే ఎలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.