భూముల వాస్తవస్థితి, పంటల వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖలు కలిపి సంయుక్త అజమాయిషీ సర్వే నిర్వహిస్తున్నట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల అసలైన రైతులు, కౌలు రౌతులను గుర్తించడం, పంటల ఇ-క్రాప్ బుకింగ్ సాధ్యమవుతుందని వివరించారు. ఎటువంటి పూచీకత్తు లేకుండానే రైతులు, కౌలు రైతులకు బ్యాంకర్లు లక్షా60 వేల వరకు రుణం అందించాలని ఆదేశించారు. ఎవరికైనా రైతులకు సమస్య ఎదురైతే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని జేసీ దినేశ్ కుమార్ సూచించారు.
ఇదీ చదవండి: 'లంచం ఇచ్చేవారికే ఇసుక సరఫరా చేస్తున్నారు'