కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ నడుస్తోంది. స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించాలని ప్రభుత్వం కోరుతుంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎవరు లేని నిరుపేదలు, భిక్షాటనపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. అలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చారు గుంటూరుకు చెందిన జైన యువజన సంఘం ప్రతినిధులు. ఉదయం ఉప్మా, మధ్యాహ్నం పులిహోర, సాంబార్ రైస్ ప్యాక్ చేసి అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
ఇదీ చదవండి : 'ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మెలగాలి'