రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ .. మూడు రాజధానులు అంశంపై ముందుకెళ్తామని ప్రసంగించటం ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని అమరావతి యువజన ఐకాస కో కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జేకేసీ నగర్లో అమరావతి యువజన జేఏసీ ఆధ్వర్యంలో గవర్నర్ ప్రసంగం పత్రాలు, బడ్జెట్ ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపారు.
బడ్జెట్ సమావేశాలలో భాగంగా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులు నిర్ణయానికి మద్దతు పలకటం సరైన నిర్ణయం కాదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తుందని రావిపాటి సాయి విమర్శించారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు ఇంతవరకు చల్లించకపోవటం దారుణమన్నారు.
ఇదీ చూడండి ప్రాజెక్టులకు నిధులెక్కడ?... ఆదాయం పెంచుకునే మార్గాలేవి: చంద్రబాబు