మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలతో గుంటూరు సర్వజనాసుపత్రికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితుల కోసం శుక్రవారం ప్రత్యేక వార్డును కేటాయించారు. ప్రస్తుతం 27 మంది చికిత్స పొందుతున్నారు.
వేగంగా సమకూర్చుకోవాలి..
తొలి దశలో ముప్పును గుర్తించకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనుమానిత లక్షణాలతో వచ్చేవారిని ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. శస్త్ర చికిత్స గదిని సిద్ధం చేయడం, అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడం, ఔషధాలను, మానవ వనరులు సహా అవసరమైన వసతులను సమకూర్చుకోవడం వంటి పనులను వేగంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇవీ చూడండి : దిల్లీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో వైద్యపరికరాలు