Banks are not giving loans to farmers: రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై లోన్ ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం మందడం, అనంతవరంలో రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకెళ్లేందుకు వెళ్లారు. అక్కడి బ్యాంకు అధికారుల సమధానంతో రైతులు కంగు తిన్నారు.
అమరావతి రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని అన్నదాతలు... ఆవేదన వ్యక్తంచేస్తున్నారు . మందడం, అనంతవరంలో రుణాల కోసం వెళ్లగా.. బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానం విని ఆవేదన చెందారు. రైతుల ఇళ్లకు రుణాలిస్తామేగానీ ఖాళీ ప్లాట్లకు ఇవ్వలేమని చెప్పారని.. వాపోయారు. గత ప్రభుత్వంలో రుణాలు తీసుకున్న తాము వైసీపీ హయాంలో మాత్రం అధికారులు నిరాకరించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిలకు, ఇతర అవసరాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ఇవ్వడంలేదని రైతులు చెప్పారు.
ఇవీ చదవండి: