ఈ నెల 7వ తేదీన చినకాకాని జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొన్న ఏడుగురు రైతులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం, నిడమర్రుకు చెందిన ఫణీంద్రరెడ్డి, బత్తుల హరిదాసు, పలగాని తాతారావు, దోనే వీరాంజనేయులు, గుంటూరుకు చెందిన నయాబ్ రసూల్, రియాజ్, వెంకట సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు.. రైతులకు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచెర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి.. కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: