ETV Bharat / state

MLA Vs Public: కాల్వలు నిర్మిస్తా.. మాకొద్దన్న స్థానికులు.. ఎమ్మెల్యే శాపనార్థాలు

MLA Musthafa Vs Public: ఎక్కడైనా మురుగు కాల్వలు నిర్మిస్తామంటే ప్రజలు సంతోషిస్తారు.. కానీ అక్కడి వారు మాత్రం వద్దంటున్నారు. అసలే ఇరుకు రోడ్లు... ఉన్న కాల్వల్లోనే చెత్త తీయటం లేదు. ఇప్పుడు కొత్తగా కాల్వల నిర్మాణం పేరిట రోడ్లను చిన్నగా చేయొద్దని ఏకంగా ఎమ్మెల్యేనే నిలదీశారు. భూగర్భ డ్రైనేజి కావాలని ఏళ్ల తరబడి కోరుతున్నా పట్టించుకోకుండా... ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కాలువల నిర్మాణం కోసం శంకుస్థాపన ఎందుకని ప్రశ్నించారు. గుంటూరు నగరంలో జరిగిన ఈ ఘటన స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాకు ముచ్చెమటలు పట్టించింది. ప్రజలు ఎదురు తిరగటంతో వారిపై శాపనార్థాలకు దిగిన ఎమ్మెల్యే... ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 7, 2023, 7:29 PM IST

MLA Musthafa Vs Public : గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపాకు తన నియోజకవర్గంలో మురుగు కాల్వలు బాగు చేయాలనే ఆలోచన వచ్చింది. పాత గుంటూరులోని బ్రహ్మంగారి గుడి వీధిలో కాలువ పనులకు శంకుస్థాపన చేయాలని భావించారు. అధికారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొబ్బరికాయలు, పూలు సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో మురుగునీరు సరిగా పోక, చెత్త తీయక స్థానికులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజి కావాలని ఎమ్మెల్యేని అడిగారు. సరేనన్నారు. ఇప్పుడు భూ గర్భ డ్రైనేజికి కాకుండా సైడు కాల్వల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయటానికి రావటంతో వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పటికే అక్కడి వీధుల్లో రెండువైపులా మురుగు కాలువలున్నాయి. వాటిని వెడల్పు చేస్తే రోడ్ల విస్తీర్ణం మరింతగా తగ్గిపోతుంది.

సమస్య తీర్చమంటే శాపనార్థానాలు పెట్టిన ఎమ్మెల్యే

పైగా ఇప్పుడు పనులు మొదలుపెడితే ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. నగరంలో చాలాచోట్ల రోడ్డు విస్తరణ పనులే నెలల తరబడి సాగుతున్నాయి. ఇప్పుడు పనులు ప్రారంభిస్తే... కొద్దిరోజుల్లో వర్షాలు కురిస్తే తమకు ఇబ్బందులు వస్తాయని స్థానికులు ఆలోచించారు. ఎప్పుడు వర్షం కురిసినా నీరు పోయే మార్గం లేక రోడ్లు మునిగి తాము ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పారు. అందుకే కాలువలు వద్దని, భూగర్భ డ్రైనేజి కావాల్సిందేనని తెగేసి చెప్పారు. అయితే మీకు అభివృద్ధి వద్దా అంటూ ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. 9ఏళ్లుగా తమ ప్రాంతంలో ప్రజలు మురుగుతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎందుకు వచ్చారని ప్రజలు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నాశనమైపోతారని శాపనార్థాలకు దిగారు. ఎమ్మెల్యే ముస్తపా తీరుతో మహిళలు అవాక్కయ్యారు.

రెండు సార్లు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు మేం నాశనం కావాలా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రజలకు స్థానిక కార్పోరేటర్ అశోక్ కూడా తోడై ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించారు. భూ గర్భ డ్రైనేజి గురించి కౌన్సిల్​లో అడిగానని, ప్రతిపాదనలు సమర్పించానని.. వాటిని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిపోయాక స్థానిక మహిళలు ఆయన ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము పడిన ఇబ్బందులు ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే తీరు సరిగా లేదని.. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేవలం కమిషన్ల కోసమే ఎమ్మెల్యే ఇప్పుడు పనులు ప్రారంభించటానికి వచ్చారని స్థానిక కార్పోరేటర్ అశోక్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజి కావాలని కౌన్సిల్ సమావేశాల్లో కూడా తాను కోరానని, అయినా పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు హడావుడిగా పనులు చేపట్టటం రాజకీయ లబ్దికోసమేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ధోరణిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముస్తఫా తీరుపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మొదటిసారి గెలిచినప్పుడు తాము అధికారంలో లేం కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని చెప్పిన ముస్తఫా.. రెండోసారి గెలిచాక కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇప్పుడు పాతగుంటూరులో జరిగిన ఘటనే అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.