Guntur District Yuddh People Worried on Israel Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం గుంటూరు జిల్లాలో కొందరిని కలవరపెడుతోంది. వందల ఏళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చిన యూదులు తమ పూర్వభూమి ఇజ్రాయెల్‌పై జరిగిన దాడితో కలత చెందుతున్నారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నారు. ఎక్కడి యూదులు? ఇక్కడికి ఎందుకొచ్చారు? ఏం చేస్తున్నారు? తెలుసుకుందాం రండి.
300 ఏళ్ల క్రితం తెలంగాణా ప్రాంతానికి వచ్చిన యూదులు అక్కడి ద్రాక్ష తోటలో పని చేశారు. ఆ తర్వాత అమరావతి సంస్థానానికి తరలివచ్చారు. వీరిలో కొందరు తిరిగి వెళ్లిపోయారు. మూడు కుటుంబాల వారు మాత్రం చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో స్థిరపడ్డారు. ఆ కుటుంబాలు ఇప్పుడు 40కి చేరుకున్నాయి. వారి జనాభా 200వరకు ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం వీరిపై పడింది. ఇజ్రాయెల్‌లో ఉన్న తమ ఆత్మీయుల భద్రతపై వీరు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం త్వరగా ముగిసిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
"1909లో ఇక్కడ సమాజ మందిరం నిర్మాణం చేసుకున్నారు. మేము తక్కువ జనాభా కాబట్టి.. గుర్తింపు లేకుండా ఎవరికి తెలియకుండా ఉండాలని నేర్పించే వాళ్లు. ప్రార్థనలు చేస్తున్నప్పుడు హమాస్ వాళ్లు వచ్చి.. దాడి చేసినట్లు తెలుసుకున్నాము. ఇక్కడ ఉన్న 40కుటుంబాల వాళ్లము ఇజ్రాయెల్‌లో ఉన్న మా వారికోసం ఉపవాస ప్రార్థనలు చేశాము." -యాకోబీ సాదోక్, యూదుల మతపెద్ద, కొత్తరెడ్డిపాలెం
అమెరికాలో యూదులు, ముస్లింల తర్వాత సిక్కులే
యూదుల్లో మొత్తం 12 గోత్రాలకు చెందినవారుంటారు. కొత్తరెడ్డిపాలెంలో నివసించే వీరు ఎఫ్రాయిమ్ గోత్రీకులు. వీరంతా 1909లోనే ఇక్కడ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకున్నారు. యూదు పండుగలు, ఉత్సవాలు నిర్వహించుకుంటారు. హీబ్రూ భాషలో ప్రార్థనలు చేస్తుంటారు. వీరందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఇక్కడి ప్రజలతో కలిసిపోయే ఉంటారు.
"లోకంలో ఎవరి దేవతలను వారు పూజిస్తున్న.. లోకంలో అందరి కోసం మేము ప్రార్థనలు చేస్తుంటాం. హమాస్ దాడి చాలా బాధాకరం. పరిస్థితి అలా వచ్చింది. మేము చాలా దుఃఖించాము." -అబ్రహాం మతన్యా, యూదు మతస్థుడు, కొత్తరెడ్డిపాలెం
ఉగ్రకుట్ర: ఆ దేశం నుంచి వచ్చినవారే టార్గెట్!
అసలు ఇక్కడ యూదులు ఉంటున్న విషయం 2004వరకూ ఎవరికీ పెద్దగా తెలియదు. అంతలా వీరు ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. హైదరాబాద్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పట్టుబడిన సమయంలో వారు యూదులను చంపటం కోసం వచ్చారనే విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. అప్పుడు చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో యూదులు నివసిస్తున్న విషయం తెలిసింది. ఇక్కడికి ఇజ్రాయెల్ నుంచి వారి బంధువులు, మత పెద్దలు వచ్చి వెళ్తుంటారు. కొందరు ఇక్కడి నుంచి ఇజ్రాయెల్ వెళ్లిపోయారు.
కాలిఫోర్నియాలో కాల్పులు... ఒకరు మృతి
"మమ్మల్ని ఎస్సీ కేటగిరిలోనే చేర్చారు. మాకు ప్రత్యేకంగా మా కోసం కేటగిరి చేయలేదు. ఇప్పటివరకు మేము అందరితో కలిసిపోయే ఉన్నాము. అని ఆచారలను అందర్ని గౌరవిస్తూ ఉంటాము. ఇజ్రాయెల్ పూర్తిగా కొలుకోవాలి.. యుద్ధ వాతావరణం శాంతించాలని కోరుకుంటున్నాము." -అబ్రహం, కొత్తరెడ్డిపాలెం
"ఆచారాలు బాగున్నాయి. మా పెద్దవాళ్లు పాటించారు. మాకు ఇష్టం కాబట్టి ఏ మతంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు." -సీను, కొత్తరెడ్డిపాలెం
కొత్తరెడ్డిపాలెం నుంచి కొందరు విజయవాడ, నందిగామ ప్రాంతాలకు వెళ్లారు. ప్రైవేట్ ఉద్యోగాలు, వివిధ రకాల వృత్తులతో పాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎప్పటికైనా అంతా ఓచోట చేరతామనే విశ్వాసంతో వీరు జీవిస్తుంటారు.
Operation Ajay Israel India : ఇజ్రాయెల్ X హమాస్.. భారతీయులను తరలించడానికి 'ఆపరేషన్ అజయ్'