ETV Bharat / state

'నేనలా అనలేదు.. నా వ్యాఖ్యలు వక్రీకరించారు' - వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయడు తాజావార్తలు

ఇసుక విధానంపై తాను ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదని.. తన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు వక్రీకరించారని... గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. తెదేపా నేతలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

guntur district vinukonda mla bolla bramhanaidu clarifies on sand issue
బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ ఎమ్మెల్యే
author img

By

Published : Jun 3, 2020, 2:56 PM IST

ఇసుక విధానంపై తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పారు. ఇటీవల గుంటూరులో జరిగిన సమీక్షలో మాట్లాడిన బొల్లా... రీచ్ నుంచి యార్డుకు వెళ్లేలోగా లారీలో ఇసుక మాయమైపోతోందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. తాజాగా.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

సాంకేతిక సమస్యల కారణంగా సరఫరా ఆలస్యమవుతోందన్నదే తన వ్యాఖ్యల్లో ఉద్దేశం తప్ప.. ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టలేదని స్పష్టం చేశారు. ఇసుక మరింతగా ప్రజలకు అందుబాటులోకి రావాలనేదే తన అభిమతమని వెల్లడించారు. తెదేపా నేతలు కావాలనే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని బ్రహ్మనాయుడు మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ప్రశ్నించినందుకు... ప్రాణం తీశాడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.