గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పలు ప్రాతాలను సందర్శించారు. మల్లమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకూ నడుచుకుంటూ వెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఆయా ప్రాంతాలలో పరిశుభ్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్పై అధికారులకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :