గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన కంటెయిన్మెంట్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, నగరపాలక కమిషనర్ చల్లా అనురాధ పరిశీలించారు. బ్రాడిపేట ప్రాంతంలో గత 4రోజులు నుంచి దుకాణాలు మూసివేయటంతో వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కారణంగా మరో వారం రోజులు పాటు యథావిధిగా నిబంధనలు అమలు చేస్తామన్నారు. వారం రోజులు తరువాత కరోన ఉద్ధృతి తగ్గి కేసులు నమోదు కాకపోతే కంటెయిన్మెంట్ నిబంధనలు సడలిస్తామని చెప్పారు.
అయితే వ్యాపారస్తులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 4 నెలలు నుంచి లాక్డౌన్ ప్రభావంతో అద్దెలు కట్టలేకపోయామని వాపోయారు. ఇప్పుడు కంటెయిన్మెంట్ ఏరియాగా ప్రకటించడం వల్ల పూర్తిగా అప్పులు పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయంగా వ్యాపారస్తులకు రాయితీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.