గుంటూరులో పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న లేఅవుట్ అభివృద్ధి పనులను కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధతో కలిసి ఏటుకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు వద్ద ఇళ్ల స్థలాలను పనులను పర్యవేక్షించారు. అంతర్గత రోడ్లతోపాటు లేఅవుట్ అభివృద్ధి పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఏటుకూరులో 80 శాతం పనులు పూర్తయినందున.. మిగిలిన పనులు పూర్తిచేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. గుంటూరు పశ్చిమ మండలానికి లాల్ పురం, చౌడవరంలో ప్రతిపాదిత ఇళ్ల స్థలాల భూములను రైతుల నుంచి సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి...