కరోనా మహమ్మారి ప్రభావం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపైనా పడింది. ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు పాఠశాల విద్యార్థులు, సామాన్య ప్రజలతో కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. అయితే ఈ సారి మాత్రం వేడుకలను తిలకించే వారి సంఖ్య పరిమితం కానుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, బృంద నృత్యాలు ఇలా.. అన్నింటిలోనూ పరిమిత సంఖ్యలోనే కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ.ఎస్.దినేష్‌కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రగతి కార్యక్రమాలను తెలిపేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. దూరం నుంచే వాటిని తిలకించే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, హాజరయ్యే వారి సంఖ్య ఇవన్నీ.. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జేసీ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్ష దాటాయ్.. వైరస్‌తో 1,090 మంది మృతి