ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడిని అదే మార్గంలో వస్తున్న బస్సు వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు మృతిచెందాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద చిలకలూరి పేట - నరసరావుపేట మార్గంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పిడుగురాళ్ళ మండలం కరాలపాడుకు చెందిన శంకల గోపి (30) ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనుల నిమిత్తం చిలకలూరిపేట వైపు వస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు గోపి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం వెనక వైపు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన గోపి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నాదెండ్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాదెండ్ల పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: