ETV Bharat / state

యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు - యూవీ క్రియోషన్స్​పై దాడులు

UV creations: హైదరాబాద్​లోని యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహించింది. ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి తేడా ఉండడాన్ని గుర్తించిన అధికారులు... లోతైన పరిశీలనకు సంస్థకు చెందిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.

UV creations
యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు
author img

By

Published : Nov 2, 2022, 10:14 AM IST

UV creations: కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం యూవీ క్రియేషన్స్ సంస్థపై దాడులు చేసి చేసింది. ఆ సంస్థ నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలకు చెల్లిస్తున్న జీఎస్టీకి వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. నిఘా విభాగం డిప్యూటీ కమిషనర్ వైశాలి మల్హోత్రా నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాల్లో ఆరు కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాల్సి ఉందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఆ సంస్థకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆ సంస్థ నిర్వహించిన వ్యాపార లావాదేవీలు, చెల్లించిన జీఎస్టీలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఇంకా ఎంత చెల్లించాల్సి ఉందో తెలుస్తుందని తెలిపారు.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.