అమూల్ కోసం ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతోందని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. మౌలిక వసతుల కోసం అమూల్‌కు రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తారా..? అని నిలదీశారు. విజయాకు కాకుండా అమూల్‌కు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ప్రశ్నించారు. గుజరాత్ వ్యవస్థల కోసం ప్రభుత్వం పనిచేయడం ఆశ్చర్యం వేస్తోందని ధూళిపాళ్ల పేర్కొన్నారు.
జగన్.. ఏపీకి ముఖ్యమంత్రా..? గుజరాత్‌కు ముఖ్యమంత్రా..? అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సబర్‌కాంతా యూనియన్ గుజరాత్‌లో పాలసేకరణకు రూ.730 ఇస్తోందన్న ధూళిపాళ్ల... అమూల్‌కు చెందిన అదే యూనియన్ ఏపీలో రూ.650 ఇవ్వడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలోని సహకార వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమూల్ సొంతంగా రావాలని ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. పాడిరైతులు ఎవరికి పాలు పోయాలో ప్రభుత్వం చెప్పడం సరికాదన్న ధూళిపాళ్ల... అమూల్‌కు ఇచ్చే సహకారం తమకిస్తే.. దానికంటే రూ.30 ఎక్కువ ఇస్తామని స్పష్టం చేశారు. పాడిరైతులను కాపాడేందుకు కలిసొచ్చే డెయిరీలతో కలిసి పోరాడతామని చెప్పారు.
ఇదీ చదవండీ... నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం