ETV Bharat / state

కొండవీడు కోట అభివృద్ధికి రూ. 13.35 కోట్ల నిధులు - కొండ‌వీడు కోటకు నిధులు విడుదల

గుంటూరు జిల్లాలోని కొండవీడు కోట అభివృద్ధికి 13.35 కోట్లు రూపాయల నిధులు విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే రజిని తెలిపారు.

government releases
కొండవీడుకోట అభివృద్ధికి 13.35 కోట్లు రూపాయల నిధులు విడుదల
author img

By

Published : Jan 21, 2021, 2:10 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో ఉన్న కొండ‌వీడు కోట అభివృద్ధికి... 13.35 కోట్లు రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ... ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని విలేకరుల స‌మావేశం నిర్వ‌హించారు. కొండ‌వీడు అభివృద్ధికి సంబంధించిన ఐదేళ్ల ప్ర‌ణాళిక‌, ప్రాజెక్టు పూర్తి నివేదిక‌, అందుక‌య్యే ఖ‌ర్చుల వివ‌రాల‌ను.. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 23వ తేదీన సీఎం జ‌గ‌న్‌ దృష్టికి తీసుకెళ్లాన‌ని తెలిపారు.

కొండ‌వీడు అభివృద్ధిని కోరుతూ అదే రోజు సీఎంకు విజ్ఞాప‌న ప‌త్రాన్ని అంద‌జేశానని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ నెల 18వ తేదీన నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. 2020-21 కు 7.79 కోట్లు, 2021-22కు 1.26 కోట్లు, 2022-23కు 1.28 కోట్లు, 2023-24కు 1.48 కోట్లు, 2024-25కు 15.2 కోట్లు మంజూరు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌ని తెలిపారు. ఈ నిధుల‌తో కొండ‌వీడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.

శ‌ర‌వేగంగా ప‌నులు

కొండ‌వీడులో ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని వివ‌రించారు. 5 ల‌క్ష‌ల రూపాయలతో ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఇటీవ‌లే చెక్‌పోస్టును ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. కొండ‌పైన చిన్న‌పిల్ల‌ల పార్కు, పార్కింగ్ ఏరియా, మూడు వ్యూ పాయింట్లు, న‌ర‌సింహ‌స్వామి ఆల‌య నిర్మాణాలు.. మ‌రో మూడు నెల‌ల్లో పూర్త‌వుతాయ‌ని పేర్కొన్నారు. రెండు నెల‌ల్లోనే కొండ‌వీడు రూపురేఖ‌లు పూర్తిగా మారిపోతాయ‌ని అన్నారు.

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నిధుల‌తో మొత్తం 53 ర‌కాల అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌బోతున్నాం. అతిథుల‌కు సౌక‌ర్యంగా ఉండేలా అన్ని చోట్లా సైన్ బోర్డులతో పాటు.. ప‌ర్యాట‌కులు సేద తీరేందుకు వీలుగా మూడు విశ్రాంతి గ‌దుల‌ను నిర్మిస్తున్నాం. 50 లక్ష‌ల రూపాయలతో పాత అతిథి గృహాన్ని ప‌ర్యావ‌ర‌ణ, విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయనున్నాం. టాయిలెట్లతో పాటు.. కొండ‌పై ఉన్న పుట్టాల‌మ్మ చెరువు వ‌ద్ద వాచ్ ట‌వ‌ర్ నిర్మిస్తాం. పుట్టాల‌మ్మ‌, వెదుళ్ల‌, ముత్యాల‌మ్మ చెరువుల చుట్టూ.. 24 ల‌క్ష‌ల రూపాయల వ్యయంతో రాళ్ల‌తో నిర్మాణాలు చేప‌డ‌తాం. కొండ‌వీడు కోట ప్రాంతంలోని అన్ని మార్గాల్లో కూర్చునేందుకు వీలుగా వినూత్న‌మైన బెంచీల ఏర్పాటు..నిర్మించనున్నాం. కొండ‌పై ఆర్‌వో ప్లాంటు, సోలార్ లైటింగ్‌, మొక్క‌ల పెంప‌కం, అత్యంత సుంద‌రంగా పార్కులు, చిన్న పిల్ల‌ల ఆట‌స్థ‌లం, రాక్ క్లైంబింగ్‌, రోప్ కోర్సు, జీప్ లైన్‌, వెదుళ్ల చెరువులో బోటింగ్‌, 3డీ మోడ‌ల్ బొమ్మ‌లు, బ్యాట‌రీతో న‌డిచే వాహ‌నాలు.. ఏర్పాటు చేస్తున్నాం. కొండ‌వీడు గ‌త వైభవాన్ని తిరిగి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాం. ఇప్ప‌టికే వేలాదిగా ప‌ర్యాట‌కులు రోజూ కొండ‌వీడుకు వ‌స్తున్నార‌ు. వీరి సంఖ్య మ‌రింత‌గా పెరి‌గే అవకాశం ఉంది.

- ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

ఇదీ చదవండి:

ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు.. విజయవాడలో ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.