గుంటూరు జిల్లా బాపట్ల మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో.. నకిలీ మద్యం విక్రయిస్తున్నారని సమాచారంతో.. ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. బ్రాండెడ్ సీసాల్లో.. చీఫ్ లిక్కర్ పోసి ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఎస్ఈబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల సూపరింటెండెంట్ కె. మహేష్ ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మహేష్‌తో పాటు అతనికి సహకరిస్తున్న బాజిరెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు నెలల నుంచి ఈ తంతు నడుస్తున్నట్లు అధికారులు తెలిపార. నిందితుల నుంచి మద్యం స్టిక్కర్లు, బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వివరించారు.
ఇవీ చూడండి…