Assigned lands ఎసైన్డ్ భూములపై రైతులకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం పొరుగు రాష్ట్రాల్లో కమిటీ పర్యటించే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎసైన్డ్ భూములు పొందిన వారికి ఉన్న ప్రయోజనాలు, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ప్రయోజనాలు వర్తిస్తున్నాయనే అంశాలపై అధ్యయనం ద్వారా తగిన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. ఎసైన్డ్ సాగు భూములపై రైతులకు హక్కుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో సమావేశమైంది. లోతుగా అధ్యయనం చేసిన నివేదిక సమర్పిస్తామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు తానేటి వనిత, మేరుగు నాగార్జనతోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇవి చదవండి: