నీటిని పొదుపుగా వాడుకోవాలని ... రాబోయే రోజుల్లో నీటి సమస్య ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ''ప్రతీ నీటి చుక్కను లెక్కిద్దాం...'' అనే అంశంపై గుంటూరులో నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. నీటి ఆవశ్యకత.. అవసరం.. ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలు పై ప్రసంగించారు. రైతులకు, మొక్కలకు, సమాజంలో ఉన్నమానవ కోటికి మేలు జరగాలంటే నీటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శాసన సభ్యులు నీటి రక్షణకు కృషి చేయాలన్నారు. నీటి ఆవశ్యకతపై ప్రజల్లో అవహగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమానికి పలువురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.
ఇదీచూడండి.'కృష్ణానీటిని తెలంగాణకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు'