ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బాపట్ల లో 1976-80 వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని హుషారుగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తరువాత తమ తమ స్నేహితులను కలిసికొని ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పని చేసిన ఎం మాలకొండయ్య ఐపీఎస్, రాష్ట్ర జీఎస్టీ అధిపతిగా పని చేసిన హరేరామ్ ఐఆర్ఎస్ వంటి వారు ఈ కళాశాల విద్యార్థులే. 40 సంవత్సరాల తరువాత కలిసిన వీరందరూ ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆ రోజుల జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, ఆనాటి స్నేహితులతో సరదాగా గడుపారు.
తమతో చదివిన పూర్వ విద్యార్థి కేఈ కృష్ణమూర్తి ప్రస్తుత ప్రిన్సిపల్‌గా చేయటం తామందరికీ చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాల మెుదలయ్యి 75 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న తరుణంలో తామంతా కలవటం మరుపురాని జ్ఞాపకమన్నారు. వీరితో చదువుకున్న కొందరు స్నేహితులు ఈ లోకంలో లేకపోయినా, వారితో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో నేటి నుంచి అందుబాటులోకి కోవిడ్-19 పరీక్ష కేంద్రం