చెడు వ్యసనాలకు బానిసై గంజాయి విక్రయిస్తున్న11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి గంజాయి పీల్చే హుక్కా యంత్రాలు, 12.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.
అరండల్ పేట, పట్టాభిపురం పరిధిలో గంజాయి విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వెళాంగిణి నగర్లో గంజాయి విక్రయిస్తున్న 8 మంది ముఠాను, జూట్ మిల్ వద్థ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరిలో కొందరు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. మత్తుకు బానిసై గంజాయి సేవిస్తున్న విద్యార్థులు.. డబ్బు కోసం నేరుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి.. గంజాయి కొనుగోలు చేసి గుంటూరుకు తెచ్చి అమ్ముతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. స్వల్పకాలిక ఆనందాల కోసం యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: వైకాపా నేత తన పొలాన్ని ఆక్రమించాడంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం