రాజధాని గ్రామమైన వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మరియమ్మ (50) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సోమవారం గ్రామం అట్టుడికిపోయింది. రోజంతా రెండు వర్గాల ఆందోళనలు, బైఠాయింపులు, నినాదాలతో రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన వెనక ఎంపీ నందిగం సురేశ్ ప్రోద్బలం ఉందని, ఆయనపై కేసు నమోదు చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు.
మృతదేహంతో బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఈనేపథ్యంలో అర్ధరాత్రి ఎస్సీ సంఘాలతో ఏపీ హోం మంత్రి సుచరిత చర్చలు జరిపారు. ఎంపీ సురేష్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతామని హోం మంత్రి హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారాన్ని హోంమంత్రి సుచరిత అందించారు.
ఇదీ చదవండి:
వెలగపూడిలో రణరంగం.. స్వాగత తోరణానికి పేరుపెట్టే విషయంలో విభేదాలు