పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. అన్ని వసతులతో ఇళ్లు నిర్మించేలా వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ... ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో విఫలమయ్యాయని... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ... YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!