ETV Bharat / state

హుస్సేన్‌సాగర్ తీరాన ఫార్ములా ఈ-రేస్​.. రయ్‌ రయ్‌కి అంతా రె'ఢీ'

Formula E-Racing in Hyderabad : తెలంగాణలోని హుస్సేన్‌సాగర్ తీరాన రయ్ రయ్‌మనిపించడానికి రేసు కార్లు సిద్ధమయ్యాయి. భారత మోటార్ స్పోర్ట్స్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి నేడు భాగ్యనగరం వేదిక కాబోతోంది. ఫార్ములా ఈ- ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఇవాళ ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది.

Formula E-Racing in Hyderabad
Formula E-Racing in Hyderabad
author img

By

Published : Feb 11, 2023, 9:18 AM IST

Formula E-Racing in Hyderabad : భారత మోటార్‌ స్పోర్ట్స్‌లో కొత్త అధ్యాయానికి తెలంగాణలోని హైదరాబాద్‌లో తెర లేవబోతోంది. ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. ఇవాళ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

Formula E-Racing in Hyderabad 2023 : మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తా చాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు రెండో ప్రీ ప్రాక్టీస్‌ రేస్‌, ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అర్హత పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్‌ ఉంటుంది.

.

Formula E-Racing in Hyderabad Today : ఇప్పటికే వివిధ దేశాల డ్రైవర్లు ట్రాక్‌ను పరిశీలించారు. ఐఆర్​ఎల్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్వాహకులు.. ట్రాక్‌, ప్రేక్షకుల గ్యాలరీల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 21వేల మంది పోటీలను వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రేసింగ్‌ నిర్వహించే ఎన్టీఆర్ మార్గ్‌, సచివాలయం, మింట్‌ కాంపౌండ్‌, తెలుగుతల్లి ఫ్లైవంతెన పరిసర ప్రాంతాల్ని పోలీసులు పూర్తిగా మూసేశారు.

17 చోట్ల పార్కింగ్‌ ఏర్పాటు చేసిన అధికారులు సికింద్రాబాద్‌- ట్యాంక్‌బండ్‌ వైపు మార్గాన్ని మూసివేయనున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు అదనంగా 600 మందిని మోహరించనున్నారు. రేసింగ్‌ పోటీలకు వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం 7 కోట్లతో హుస్సేన్‌సాగర్‌లో నీటిపై తేలే మ్యూజికల్‌ ఫౌంటేయిన్‌, లేజర్‌ షో ఏర్పాటు చేశారు. సాయంత్రం 7నుంచి 9 వరకు సాగే లేజర్‌ షోలో హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయ ఘట్టాలను ప్రదర్శిస్తారు. పర్యాటక శాఖ నడిపే పడవల్లో దగ్గరకెళ్లి చూసే అవకాశముండగా, రోడ్డుపై నిలబడే పర్యాటకులు ఉచితంగా వీక్షించవచ్చు. ఫార్ములా-ఈ రేసు అనంతరం ఫౌంటేయిన్‌, లేజర్‌ షో కొనసాగునుంది.

.

శుక్రవారం ప్రాక్టీస్‌ రేసు సందర్భంగా భద్రత వైఫల్యంతో కొంత గందరగోళం నెలకొంది. ఫార్ములా-ఈ ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో అయిదు రోజులుగా ట్రాఫిక్‌ ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు రేసింగ్‌ ట్రాక్‌ మీదికి దూసుకొచ్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వెళ్లే మార్గం (రేస్‌ ట్రాక్‌)లోకి అకస్మాత్తుగా ప్రైవేటు వాహనాలు వెళ్లాయి.

అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బారికేడ్లను తొలగించేయడం, వాహనాలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడంతో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు రెప్పపాటులో ట్రాక్‌ మీదికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో అప్పటికే ప్రాక్టీస్‌ కోసం ట్రాక్‌పైకి చేరిన రేసింగ్‌ కార్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాలను వెనక్కి మళ్లించారు. దీనివల్ల సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించాల్సిన ప్రాక్టీస్‌ 5.15 గంటలకు మొదలైంది. తర్వాత ఏ అంతరాయం లేకుండా ప్రాక్టీస్‌ రేసు ముగిసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.