మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి (86) బ్లాక్ ఫంగస్‌తో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం రామిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన బ్లాక్ ఫంగస్‌కు గురయ్యారు. క్రమంగా తీవ్ర ఆనారోగ్యానికి గురై కన్నుమూశారు. 1967 - 1972 మధ్య రామిరెడ్డి గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎమ్మెల్యేగా సేవలందించారు.
అవుతు రామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి..
అవుతు రామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. దుగ్గిరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా సేవలందించిన అవుతు రామిరెడ్డి మరణం బాధాకరం. దుగ్గిరాల ప్రాంతం అభివృద్ధి కోసం తలపించిన నాయకుడాయన. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.- నాదెండ్ల మనోహర్, జనసేన నాయకుడు
ఇదీ చదవండి: