Former MLA Gadikota Dwarkanath Reddy joined TDP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ద్వారకానాథ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి, ఆయన భార్య మినహా మిగిలిన కుటుంబసభ్యులంతా తెలుగుదేశంలో చేరేందుకు వచ్చామని ద్వారాకానాథ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి దంపతులు కూడా వైఎస్సార్సీపీ వీడే పరిస్థితి రావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. విజయసాయి రెడ్డిని తెలుగుదేశంలోకి రమ్మని ఆహ్వానించే హక్కు తనకుందని ద్వారాకానాథ రెడ్డి తెలిపారు.
ఇదేం సామాజిక న్యాయం- అన్నిటా జగన్ సొంత నేతల ఆధిపత్యమే! పార్టీలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు
సీఎంవోలో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు: వైఎస్సార్సీపీలో తనకు పలుమార్లు టిక్కెట్ ఇస్తానని మాట తప్పారని వాపోయారు. రాయచోటి టిక్కెట్ ఇవ్వకపోయినా, నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పి కూడా మోసగించారని మండిపడ్డారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపైనా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పైనా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ద్వారాకానాథ రెడ్డి ఆరోపించారు. జగన్ పాలన మొత్తం అవినీతిమయమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి పాలనకు జగన్ పాలనకు పొంతనే లేదని ద్వారాకానాథ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం వాడుకుని వదిలేయడం జగన్ నైజమని ధ్వజమెత్తారు. సీఎంవోలో తన బావ విజయసాయిరెడ్డితో కలిపి మరో నలుగురు కలెక్షన్ ఏజెంట్లు ఉన్నారని ఆరోపించారు. విజయసాయి, సజ్జల, మిథున్ రెడ్డి లాంటి కలక్షన్ ఏజెంట్లకే జగన్ వద్దకు అనుమతి ఉంటుందని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి 40వేలు తక్కువ కాకుండా మెజారిటీ వచ్చే రాయచోటిలో ఈసారి ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని హెచ్చరించారు. కడపలోనే ఈసారి తెలుగుదేశం పార్టీకి 6 నుంచి 7సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ద్వారకానాథ రెడ్డి మేనమామ అవుతారు.
కదిరిలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం
YSRCP MLC Ramachandraiah joined TDP: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు పార్టీ మారడానికి గల కారణాలను రామచంద్రయ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోలుకోలేని విధంగా, జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై జగన్కు చెప్పినా వినే పరిస్థితి లేదని ఆరోపించారు. తనలాగే వైఎస్సార్సీపీలో ఎంతో మంది ఉన్నారని, సమయానుకూలంగా బయటకు వస్తారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య వెల్లడించారు. తెలుగుదేశంలో చేరేందుకే చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రామచంద్రయ్య పేర్కొన్నారు.
ఇక ప్రభంజనమే: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. రాష్ట్రంలో రాజకీయ ప్రభంజనం రాబోతోందని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా 150 సీట్లు సాధించి తీరుతుందని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగితే బతుకులు నాశనమవుతాయని, ప్రభుత్వాన్ని దించాలనే భావన అందరిలో ఉందనిదాడి వీరభద్రరావు ఆరోపించారు. అరాచక పాలనను తుదముట్టించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
ప్రజలు మార్చాలనుకునేది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్నే: గంటా శ్రీనివాసరావు