మూడు రాజధానుల నిర్ణయంతో సీఎం జగన్ తన పతనానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టుకున్నాడని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేస్తున్న మహాధర్నాలో ... రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తన తండ్రి వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన శాసనమండలిని రద్దు చేస్తామనడం వైఎస్ ఆశయాలకు తూట్లు పొడవటమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ లాయర్లు ఉండగా.. రూ.5 కోట్లు వెచ్చించి ప్రైవేటు వ్యక్తులకు కేసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన భూసమీకరణ ప్రక్రియలో క్రీయాశీలకంగా పనిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని.. అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేసే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
'మండలిని రద్దు చేస్తే... రాజశేఖర్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచినట్లే'