వైకాపా ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారిపైనే కక్ష సాధిస్తోందని... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరులో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా... వేతనాలు, ఇతర లబ్ది చేకూరకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన వారిని వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు మంచివి కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.
ఇదీ చదవండి:
బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపితే సర్కార్‌కు ఉలుకెందుకు..?