ప్రభుత్వం పరిపాలన మర్చిపోయి.. మాంసం, సినిమా టిక్కెట్ల వ్యాపారానికి దిగడం దారుణమని రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అమరావతి రోడ్డులో మట్టి వినాయకుని నిమజ్జనానికి హాజరైన కన్నా.. ప్రభుత్వ పాలన తీరును ఎండగట్టారు. మద్యం, ఇసుక వ్యాపారాలను ప్రభుత్వం ఇప్పటికే కేంద్రీకృతం చేసుకుందని.. తాజాగా మాంసం, సినిమా టిక్కెట్లు అమ్మడానికి సిద్ధం కావడాన్ని ఆయన ఖండించారు.
ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు తప్ప మిగతావారు వ్యాపారం చేయరాదనే ధోరణి సరికాదన్నారు. పేదల పొట్టకొట్టే ఇలాంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి