ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ పథకం కింద రాష్ట్రంలోని తీర ప్రాంతంలో మడ అడవులను రూ.78కోట్లతో అభివృద్ధి చేస్తామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ప్రతీప్ కుమార్ తెలిపారు. కేరళ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కేశవన్తో కలిసి గుంటూరు జిల్లా సూర్యలంకలో ఆయన శుక్రవారం పర్యటించారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టును పరిశీలించారు. సూర్యలంక తీరాన్ని సందర్శించారు. అటవీ శాఖలో రెండు వేల పోస్టుల భర్తీ కోసం జనవరిలో ప్రకటన విడుదలవుతుందని వెల్లడించారు. ఇప్పటికే 540 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. సూర్యలంక ఎకో టూరిజం ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: