గుంటూరు నగరంలో శుభకార్యాలు, హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని వృథా కాకుండా.. వారి వద్ద నుంచి ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి అందించేందుకు.. గుంటూరులో పలు చోట్ల ఫుడ్ బ్యాంకు(food banks)లు ఏర్పాటు చేశారు. గుంటూరు గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంకులను ఈ నెల 12న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు.. మేయర్ కావటి మనోహర్ తెలిపారు. ఈ మేరకు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి.. ఫుడ్ బ్యాంకులను మేయర్, కమిషనర్ పరిశీలించారు.
గుంటూరు నగరానికి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు కొన్ని వేల మంది పస్తు ఉంటారని, వారిలో కూలీ పనులు చేసుకునేవారి వద్ద హోటళ్లలో తినే స్థోమత ఉండదని.. అలాంటి వారికి ఈ ఫుడ్ బ్యాంకులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే.. ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఎన్జీవో(NGO) సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ ఫుడ్ బ్యాంకులను నగరంలో జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాలైన.. లాడ్జ్ సెంటర్, రైల్వే స్టేషన్, బస్టాండ్, చుట్టుగుంట, గాంధీ పార్క్, జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: