పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన 13 గేట్లు ఎత్తి 3లక్షల 47వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులు కేటాయించారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇవాళ సాయంత్రానికి వరద ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పులిచింతల నుంచి ప్రవాహాలు తగ్గటంతో ప్రకాశం బ్యారేజికి కూడా వరద తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి పులిచింతలతో పాటు.. కృష్ణా జిల్లాలోని వాగుల నుంచి వచ్చే వరదతో కలిపి 4లక్షల 3వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే వరద తగ్గిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.
ఇదీ చదవండి: