అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడత చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వేల లోపు డిపాజిట్లు ఉన్న చిన్న డిపాజిటర్లకు తొలుత పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. దీనికోసం 264 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేసేందుకు పాలనా అనుమతుల్ని ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మొత్తం 3 లక్షల 69 వేల 655 మంది డిపాజిటర్లకు తొలివిడత పరిహారం అందనుంది. జిల్లాల లీగల్ సెల్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు.
మరోవైపు 20 వేల లోపు ఉన్న డిపాజిటర్లకూ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. హైకోర్టు అనుమతి రాగానే చెల్లింపులు చేపట్టాలని భావిస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 1,150 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగానే తొలివిడతగా 264 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే 10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.
జిల్లా | చిన్న డిపాజిటర్లు | చెల్లింపులు (రూ.లలో) |
గుంటూరు | 19,751 | 14,09,41,615 |
చిత్తూరు | 8,257 | 5,81,17,100 |
తూర్పుగోదావరి జిల్లా | 19,545 | 11,46,87,619 |
పశ్చిమ గోదావరి | 35,496 | 23,05,98,695 |
విజయనగరం జిల్లా | 57,941 | 36,97,96,900 |
శ్రీకాకుళం | 45,833 | 31,41,59,741 |
కర్నూలు | 15,705 | 11,14,83,494 |
నెల్లూరు | 24,390 | 16,91,74,466 |
కృష్ణాజిల్లా | 21,444 | 15,04,77,760 |
అనంతపురం | 23,838 | 20,64,21,009 |
కడప జిల్లా | 18,864 | 13,18,06,875 |
ప్రకాశంజిల్లా | 26,586 | 19,11,50,904 |
విశాఖ జిల్లా | 52,005 | 45,10,85,805 |