ETV Bharat / state

Group-1 Mains: తొలిరోజు ప్రశాంతంగా గ్రూప్ 1 మెయిన్స్.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత - AP Latest News

Group 1 Mains: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ్టీ నుంచి ప్రారంభమైన పరీక్షలు 10వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పరీక్షలు 7 రోజుల పాటు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్​కు పాల్పడకుండా.. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు.

Group 1 Mains
తొలిరోజు ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
author img

By

Published : Jun 3, 2023, 7:32 PM IST

First Day of Group 1 Mains Exam: రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులను ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించారు. పరీక్షా కేంద్రాలకు వచ్చిన అభ్యర్ధులను దశలవారీగా తనిఖీలు నిర్వహించారు. అభ్యర్థులను మెటల్ డిటెక్టర్​తో క్షుణ్నంగా తనిఖీ చేశాకే కేంద్రాల్లోకి అనుమతించారు. హాల్ టికెట్​తో పాటు గుర్తింపు కార్డులను చూపించిన వారినే లోనికి పంపారు.

ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు.. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ సారి సరికొత్తగా ప్రతి అభ్యర్థికి సంబంధించి వేలి ముద్రలు, ముఖాన్ని స్కాన్ చేశారు. ప్రతి రోజూ ఈ విధానంలో హాజరు నమోదు చేసి ఒక అభ్యర్థి బదులుగా మరో అభ్యర్థి పరీక్ష రాయకుండా నివారణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రంలోని ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని విజయవాడ ఎపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించారు. అక్కడ ఉన్నతాధికారుల బృందం నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు.

పరీక్షా కేెంద్రాల్లో పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో ఉండి పర్యవేక్షించారు. ఈ పరీక్షలు గతంలో ట్యాబ్​లద్వారా ప్రశ్నాపత్రాలు ఇవ్వగా.. సాంకేతిక సమస్యలున్నాయని చెబుతూ ఈ సారి అభ్యర్థులకు పరీక్షా పత్రాన్ని ఇచ్చారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 70 బయెమెట్రిక్ యంత్రాలు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

6 వేల 455 మంది మెయిన్స్​కు అర్హత.. గ్రూప్‌-1 ఉద్యోగాలకు మొత్తం 1 లక్షా 26 వేల 449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.. 2023 జనవరి 8న గ్రూప్ 1 పరీక్షలు జరిగగా అందులో 6 వేల 455 మంది మెయిన్స్​కు అర్హత సాధించారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమ్స్ స్క్రీనింగ్ పరీక్షలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం నిర్వహించిన మొదటి పేపర్‌లో.. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ విభాగంలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, కౌలు రైతులు, నవరత్నాలు, దిశ యాప్, పోలవరానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఈ సారి పెపర్​ ఎలా ఉంటుందోనని అభ్యర్ధులు ఉత్కంఠతో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.