గుంటూరు జిల్లా తీరప్రాంతమైన డెల్టాలో తొలి కరోనా కేసు నిర్థరణ అయింది. దుండివారిపాలెం పంచాయతీకి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఇతను కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒక వైద్యశాలలో చికిత్స చేయించుకున్నాడు. తగ్గకపోవడంతో ఈ నెల 11న గుంటూరు వెళ్ళాడు. అక్కడ అతన్ని పరీక్షించి క్వారంటైన్‌కు తరలించారు. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా తేలగా.. జిల్లా అధికారులు మండల అధికారులను అప్రమత్తం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఇదీ చూడండి: