గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంటికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఇంటి సభ్యులు పొలం పనులకు వెళ్లిన వేళ.. ఈ ఘటన జరిగింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి వచ్చి వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంటితో పాటు సామగ్రి, సుమారు రూ.లక్ష నగదు, కొన్ని బంగారు ఆభరణాలు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు.
ఇదీ చదవండి:
ఉంగుటూరు థర్మకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. రూ.5 కోట్ల ఆస్తి నష్టం