ETV Bharat / state

అందుకోసమే పోలవరం ఆలస్యమైంది: ఆర్థిక మంత్రి బుగ్గన - పోలవరం ప్రాజెక్టు

Buggana comments on Polavaram: గత ప్రభుత్వం తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆర్థిక మంత్రి బుగ్గన ఆరోపించారు. ప్రస్తుత రేట్లతో పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు. టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నిచటం వల్లే నిర్మాణం ఆలస్యమైనట్టు ఆరోపించారు.

Buggana comments
Buggana comments
author img

By

Published : Nov 18, 2022, 7:04 PM IST

Updated : Nov 18, 2022, 9:31 PM IST

Finance Minister Buggana comments: పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆలస్యమైందని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. కాఫర్ డ్యామ్​లో గ్యాప్​లు వదిలేయటం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆయన స్పష్టం చేశారు. ఆ గోతులు పూడ్చేందుకు సమయం పడుతోందని.. అందుకే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అన్నారు. ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడానికి సమయం పడుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నించటం వల్లే నిర్మాణం ఆలస్యమైనట్టు మంత్రి అన్నారు.

గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ అప్పులు చేశారని.. మాజీ ఆర్ధిక మంత్రి యనమల పెద్ద అప్పుల మంత్రి అయితే చంద్రబాబు అబద్ధాల నాయుడని మంత్రి ఆక్షేపించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారన్నారు. అప్పట్లో రాజధాని వదిలేసిన పెద్ద మనసు కర్నూలు వాసులదని మంత్రి వ్యాఖ్యానించారు. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైసీపీ, బీజేపీలు అనుకూలమేనని బుగ్గన స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 18, 2022, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.