గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువులో దారుణం జరిగింది. తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని.. అతనిపై మామ, బావమరిది వేటకొడవలితో దాడికి పాల్పడ్డారు. దైద గ్రామానికి చెందిన దూదేకుల చిన్న ఖాసీంకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం.. అత్తారింటికి ఇల్లరికం వెళ్లిన ఖాసీం చెడు వ్యసనాలకు బానిసై నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. ఎన్నిసార్లు సర్దిచెప్పినా..పద్ధతి మార్చుకోకపోవటంతో చిన్న ఖాసీంను అతని మామ పలుసార్లు నిలదీశారు. శుక్రవారం రాత్రి పూటుగా తాగివచ్చిన ఖాసీం.. భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఖాసీంను, అతని మామ పీరుసాహెబ్బా మందలించారు. ఘర్షణలో చిన్న ఖాసీంపై పీరుసాహెబ్బా, బావమరిది శీనుభాషాలు.. దాడి చేయగా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వటంతో.. ఖాసీంను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్లో ఇరు కుటుంబాలు రాజీ చేసుకుని.. కేసు వెనక్కి తీసుకున్నారు.
ఇదీ చదవండి: