ETV Bharat / state

అందుబాటులోని నీటికోసం దశాబ్దాలుగా రైతుల పోరాటం.. పట్టించుకొని ప్రభుత్వాలు - fighting for water for decades

Guntur Channel : ఆ ప్రాంతంలో రైతులు దశాబ్దాలుగా సాగునీటి కోసం పోరాడుతున్నారు. గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకూ పొడిగించాలనే డిమాండ్​కు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు తమ మద్దతును తెలుపుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇస్తున్న నేతలు.. గెలిచిన తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టేస్తున్నారు. దీంతో సాగు, తాగు నీటి కోసం ఐదు మండాలాల ప్రజలు ఇబ్బంది పడక తప్పటం లేదు. కాలువ పొడిగింపుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు మండాలాల్లో 80 సంవత్సరాలు ఉద్యమాలు జరుగుతున్నా.. ఆచరణకు నోచుకొవటం లేదు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 29, 2023, 6:12 PM IST

Updated : Mar 29, 2023, 8:02 PM IST

Guntur Channel Latest : ప్రకాశం బ్యారేజికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఈ ప్రాంతంలో సాగు, తాగునీటికి అల్లాడుతున్నాయంటే, అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు ప్రాంతంమైన ఇది తాగు, సాగునీటికి ఇబ్బందులను దశాబ్దాలుగా ఎదుర్కొంటోంది. ఈ సమస్య పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు బ్రిటిష్​ కాలం నుంచే పోరాటం సాగిస్తున్నారు. కృష్ణా బ్యారేజి నిర్మాణం సమయంలోనే పెదనందిపాడు హై లెవల్ కెనాల్ నిర్మించాలనే డిమాండ్ ఉంది. 1946వ సంవత్సరంలో దీనికిసంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ, ప్రణాళిక మాత్రం రూపుదాల్చటానికి.. అడుగులు ముందుకు పడలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1961లో అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వం కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అయితే పెదనందిపాడు కాలువ అని కాకుండా దీనికి గుంటూరు ఛానల్ అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన పనులను 1965లో చేపట్టారు. పేరేదైనా సాగు, తాగునీరు అందుతుంది కదా అని ప్రజలు భావించారు. కానీ పెదనందిపాడు మండలం యామర్తి వరకు మాత్రమే కాలువలు తవ్వి వదిలేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

రైతుల ఆశలను ఆసరా చేసుకుంటున్న నేతలు : అప్పటి నుంచి ప్రజలు కాలువ పొడిగింపు కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. గుంటూరు ఛానల్​ను పర్చూరు వరకూ పొడిగించాలంటూ రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంతే కాకుండా 2006లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా కాలువ నిర్మాణంపై ఆయన హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ కూడా కాలువ పొడిగింపుపై హామీ ఇచ్చారు. అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేను గెలిపిస్తే, తాము అధికారంలోకి రాగానే కాలువ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ స్థానం నుంచి పోటి చేసిన ఎమ్మెల్యేగా విజయం సాధించటమే కాకుండా.. మంత్రి హోదా కూడా దక్కించుకున్నారు. అంతేకాకుండా జగన్​మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2022 సంవత్సరంలో జనవరి 1వ తేదీన ప్రత్తిపాడు వచ్చినప్పుడు దీనిపై మరోసారి హామీ ఇచ్చారు.

డ్రెయిన్​ నీటితో పంటలు పండిచుకోవాల్సిన దుస్థితి : కాలువ పొడిగింపు పనులు చేపడ్తమని హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి రాగానే దానికి అనుకూలంగా సర్వేలు చేయించింది. కానీ, పనులు ప్రారంభించలేదు. ఆ తర్వాత, పనులు ప్రారంభించి రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 15నెలలు గడుస్తున్నా.. ఇప్పటికి ఇటుక వేయలేదు. ఇక్కడి ప్రజలు మాత్రం ఎప్పటిలాగే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సరైన నీటి వసతి లేని కారణంగా నాగార్జున సాగర్ డ్రెయిన్ నుంచి వచ్చే నీటినే పొలాలకు మళ్లించుకుని పంటలు పండించుకోవాల్సిన దుస్థితి. తాగునీటికి కూడా ఇబ్బందిగానే ఉంటోంది. సముద్రానికి సమీపంలో ఉండటంతో భూగర్భజలాలు ఉప్పగా ఉన్నాయి. 2023-24 బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సుచరిత కొద్ది రోజుల క్రితం తెలిపారు. కానీ బడ్జెట్​లో ఆ ప్రస్తావన లేకపోవటం రైతుల్లో ఆగ్రహం తెప్పించింది. రైతులు మరోసారి దీక్షలకు పూనుకున్నారు.

"నోట్లో నీళ్లు పోసుకుంటే మురుగువాసన. తాగునీరు లేదు. సాగు నీరు లేదు. మా పోరాటం మాకు. నీళ్లు అడుగుతున్నాము. మేమేమి ఆస్తులు అడగటం లేదు. డబ్బులు అడగటం లేదు. గుక్కెడు నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వం ఆలోచిస్తుదంటే.. ఎలాంటి చెత్త ప్రభుత్వమో అర్థం అవుతోంది." -స్థానికురాలు

సర్వేలే పనులేమి లేవు : తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు తాగటానికి, సాగుకు పనికిరాని ఈ ప్రాంతం సుధీర్ఘ కాలం నుంచి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది. కృష్ణానది అతి సమీపంలోనే ఉన్నా ఇలాంటి పరిస్థితి రావటం దారుణం. ప్రకాశం బ్యారేజి నుంచి నీరు వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేవలం కాలువను తవ్వితే చాలు. ప్రస్తుతం యామర్రు వద్ద కాలువ ఆగిపోయింది. నీటిపారుదలశాఖ అధికారులు అంచనాలు రూపొందించటం, సర్వేలు జరపటంతోనే ఇప్పటి వరకు సరిపోతుంది. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవంతో పనులు జరగటం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు రావటం లేదు. దీంతో 80ఏళ్లకు పైగా ఇక్కడి ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. కాలువ విస్తరణకు సంబంధించి భూసేకరణ కోసం 113 కోట్ల రూపాయలు కావాలని అంచనా. ముందుగా ఆ నిధులు విడుదల అయితేనే రైతులు తమ భూములను కాలువ విస్తరణ కోసం ఇస్తారు. ఆ తర్వాత టెండర్లు పిలిస్తే పనులు మొదలవుతాయి. ప్రకాశం బ్యారేజిలో నీరు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని ఈ సమస్యపై ఉద్యమిస్తున్న రైతు సంఘాల నేతలు అంటున్నారు.

"బడ్జెట్​లో ప్రతి ఛానల్​కు అన్నట్లు పేర్లు ఏమి రాయారు. మొత్తం కేటాయించిన నిధులు 11వేల కోట్ల రూపాయలు. మనకు దీనికోసం కావాల్సింది.. భూ సేకరణకు 100కోట్ల రూపాయలు పైన అవసరం. ఛానల్​ను పొడిగించటానికి సుమారు 250 కోట్ల రూపాయలు కావాలి. భూసేకరణ, ఛానల్​ పొడిగింపు పనులు చేపడ్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దాని ప్రకారమే పనులు జరుగుతాయి."- మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు శాసనసభ్యురాలు

గుంటూరు ఛానల్​ కోసం

ఇవీ చదవండి :

Last Updated : Mar 29, 2023, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.