గుంటూరు జిల్లాలో గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రయత్నాల్లో రెవెన్యూ అధికారులకు మరోసారి చుక్కెదురైంది. అమరావతి మండలం వైకుంఠపురంలో భూసేకరణ అంశంపై రైతులతో చర్చించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారుల ఎదుట రైతులు తమ అభ్యంతరాలను వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. గ్రామసభ పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలో 80 శాతం రైతులు అంగీకారం తెలిపితేనే భూసేకరణ చేయాలని... లేకుంటే నిలిపివేయాలని కోరారు. భూములు ఇచ్చేది లేదని రైతులు తీర్మానించి రెవెన్యూ అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి అవస్థలు పడుతున్న రైతుల ఉదంతాన్ని గుర్తు చేశారు.
ఇదీచదవండి