farmers protest at venkatapalem: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రైతులు ఆందోళన నిర్వహించారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా పాత చట్టాన్ని వర్తింపజేసి అధికారులు, గుత్తేదారులు బలవంతంగా లాక్కున్నారంటూ.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
2011లో మంగళగిరి మండలం చినకాకాని నుంచి విజయవాడ గొల్లపూడి వరకు నిర్మించే జాతీయ రహదారి కోసం వెంకటపాలెంలో.. భూసేకరణ చేసినట్లు రైతులు తెలిపారు. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2019 వరకు రహదారి నిర్మాణం చేయకుండా వదిలేశారని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో పనులు ప్రారంభించకపోతే భూములు రైతులకు తిరిగి ఇచ్చేయాలని ఉందని రైతులు చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారి నిర్మాణ సమయంలోనూ.. సీఆర్డీఏ అధికారులు సైతం తమను మోసం చేశారని ఆవేదన చెందారు. అధికారులు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులు కలసి తమను నట్టేట ముంచారని వాపోయారు. తమకు ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని.. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Mopadu Reservoir: మోపాడు రిజర్వాయర్‌కు లీకులు.. 5 గ్రామాలకు ముప్పు!