ETV Bharat / state

రాజధాని భూములపై కక్ష.. పేదలపై వివక్ష.. : సీఎం జగన్​పై రైతుల మండిపాటు - అమరావతి రైతులు

The agony of Amaravati farmers : ఎకరం స్థలంలో ఇల్లు.. సెంటు స్థలంలో బాత్​రూం కట్టుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అదే సెంటు స్థలంలో పేదలకు ఇల్లు కట్టిస్తామనడం ఎంత వరకు సమంజసం అని అమరావతి రైతులు ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొట్టి తన ఇంటికి దారి వేసుకున్న జగన్.. పేదలపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. పేదలపై చిత్తశుద్ధి ఉంటే వారి గ్రామాల్లోనే ఐదు సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పేదలు ఉద్యమిస్తే తాము మద్దతు ఇస్తామని తెలిపారు.

అమరావతి రైతుల ఉద్యమం
అమరావతి రైతుల ఉద్యమం
author img

By

Published : Apr 7, 2023, 6:26 PM IST

Updated : Apr 7, 2023, 6:58 PM IST

అమరావతి రైతుల ఉద్యమం

The agony of Amaravati farmers : రాష్ట్రంలోని పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తామ వ్యతిరేకం కాదని అమరావతి రైతులు మరోసారి స్పష్టం చేశారు. ఏ గ్రామంలోని పేదలకు.. ఆ ఊర్లోనే ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని రైతుల డిమాండ్ చేశారు. సెంటు భూమి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన ఇంటిని ఎకరం స్థలంలో నిర్మించుకుంటే.. పేదలకు ఒక సెంటు స్థలం ఏ మాత్రం సరిపోతుందని రైతులు మందడంలో ప్రశ్నించారు. గత ప్రభుత్వం పేదల కోసం రాజధానిలో ఐదు శాతం భూమిని కేటాయించిందని... అందులో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన ఆర్ 5 జోన్ లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు వస్తాయని.. సెంటు భూమి ప్రతిపాదనతో అవన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొన్నారు.

ఇళ్ల పేరుతో పేద ప్రజలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోమారు మోసం చేస్తున్నారు. సెంటు స్థలంలో బాత్ రూం, ఎకరం స్థలంలో ఇల్లు కట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి.. పేద ప్రజలు, దళితులకు కేవలం సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలంతా తాము ఇప్పటికే నివసిస్తున్న ప్రాంతం, గ్రామంలోనే ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలని పోరాడాలి. వారికి మద్దతుగా మేం కూడా పాల్గొంటాం. ఇళ్లు కట్టుకునేందుకు రుణ సౌకర్యం కూడా కల్పించాలి. - కంభంపాటి శిరీష, రైతు రాయపూడి

మేం పేదలకు వ్యతిరేకం కాదు. రాజధాని కోసం సేకరించిన భూమిలో కాకుండా తుళ్లూరు, వడ్లమాను, హరిశ్చంద్రాపురం.. ఇలా ఎక్కడైనా సరే.. ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వాలని పేద ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. టిడ్కో ఇళ్ల కోసం డబ్బు కట్టిన వాళ్లు ఇప్పుడు ఇల్లు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు. - గంగాభవాని, రైతు మందడం

సీఎ జగన్ మోహన్ రెడ్డి కక్ష పూరితంగా రాజధాని విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్ 5 జోన్ కు వ్యతిరేకంగా అన్ని గ్రామాల్లో గతంలో గ్రామసభలు పెట్టారు. అన్ని ప్రాంతాల్లో కూడా వ్యతిరేకంగా తీర్మానించారు. అయినా సరే.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం ధర్మం కాదు. పేదల ఇళ్లు కూల్చి తన ఇంటికి రోడ్డు వేసుకున్న జగన్ మోహన్ రెడ్డి.. పేదలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ.. ఇలాంటి చర్యలకు పూనుకోవడం సరికాదు. రాజధాని కడతామంటే భూములిచ్చామనే విషయాన్ని మర్చిపోతే ఎలా..? - ఆలూరి శ్రీనివాసరావు రైతు మండలం

ఇవీ చదవండి :

Last Updated : Apr 7, 2023, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.