గుంటూరు జిల్లాలో తీగజాతి కూరగాయల పంటలు సాగుచేస్తున్న రైతులు ఆధునిక పద్ధతులను అవలంభిస్తున్నారు. గతంలో కర్రలతో పందిళ్లు వేస్తే అవి రెండు, మూడేళ్లకే విరిగిపోయి తీగలు కిందపడి దిగుబడులు సరిగా వచ్చేవి కావు. ఈ నేపథ్యంలో ఇనుప పందిళ్లపై అన్నదాతలు దృష్టిపెట్టారు. ఇవి గట్టిగా ఉండటంతో వాన, గాలికి నిలదొక్కుకుని తీగలు ఎక్కువగా పెరిగి కాయలు బాగా కాస్తున్నాయని వారు చెబుతున్నారు. ఎకరానికి రూ.2 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. బీర, కాకర, దొండ, పొట్లలాంటి కూరగాయల సాగుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని, ప్రభుత్వం వీటిపై రాయితీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మంగళగిరి మండలం నూతక్కికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి వేసిన ఇనుప పందిళ్లను పలువురు రైతులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండీ.. నెరవేరని ఆశయం.. ట్రస్టు భూములు అన్యాక్రాంతం!