గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో కొత్తతరహా మోసం బయటపడింది. పాలపాడుకు చెందిన సుమారు 150 మంది రైతుల నుంచి వేలిముద్రలు సేకరించి ఓ డీలర్ సొమ్ము కాజేశాడు. నగదు కోసం బ్యాంకుకు వెళ్లిన రైతులకు అసలు విషయం తెలియటంతో... నరసరావుపేట గ్రామీణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఎయిర్టెల్ కేవైసీ పేరిట డీలర్లు వేలిముద్రలు తీసుకొని తమ పేరుపై పేమెంట్ బ్యాంక్ ఖాతాలు తెరచి... ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే సొమ్మును తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. రైతులకు కేవైసీ చేయించిన డీలర్ తనకు 20 శాతం కమీషన్ ఇస్తే నగదు తిరిగి వచ్చేలా చేస్తానని అన్నట్లు తెలిపారు. జొన్నలగడ్డ గ్రామానికి చెందిన డీలర్ శంకర్ నరసరావుపేటకు చెందిన మరో ముగ్గురు కలసి తమని మోసం చేశారని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి