ETV Bharat / state

రైతుల ప్రాణాలు పోతున్నా...పట్టించుకోరా!!

రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లాలోని తాడికొండ, నందిగామలో మహిళలు, రైతులు ఆందోళనలకు దిగారు. ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలకు మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావం తెలిపారు.

farmers and women darna at guntur district opposing three capital system
గుంటూరులో రైతులు, మహిళల ధర్నా
author img

By

Published : Feb 5, 2020, 1:08 PM IST

గుంటూరులో రైతులు, మహిళల ధర్నా

అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారు అజేయ కల్లం కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఐకాస ఆధ్వర్యంలో నందిగామలో చేపట్టిన రిలే దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ఉద్యమం అంతకంతకూ పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రైతులు ప్రాణాలు కోల్పోతున్నా... ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... అమరేశ్వరునికి నైవేద్యం
ఆంద్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నందిగామ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 27వ రోజుకు చేరుకున్నాయి. రాజధానిని మూడు ముక్కలు చేయవద్దని అమరావతే రాజధానిగా ఉండాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తాడికొండ నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై అమరావతి చేరుకొని... పంచారామ క్షేత్రమైన అమరేశ్వరాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అమరేశ్వరునికి నైవేద్యం సమర్పించి... రాజధాని తరలించకుండా చూడాలని వేడుకున్నారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..
భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని పలువురు హెచ్చరించారు. సీఎం జగన్ కుట్రతో రాజధాని అమరావతిని తరలించడానికి చూస్తున్నారని వారు ఆరోపించారు.

ఇదీ చదవండి: "అమరావతా..? 3 రాజధానులా? రెఫరెండం పెట్టండి"

Intro:AP_GNT_71_04_RAJADHANI_RAITULA_ANDOLANA_RALLY_AV_AP10115

Body:ఆంద్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తాడికొండ నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలపై అమరావతి చేరుకొని బస్టాండ్ కూడలి నుంచి పురవీధుల్లో గుండా పంచారమ క్షేత్రమైన అమరేశ్వరాలయం వరకు ర పాదయాత్ర నిర్వహించారు. అమరేశ్వరుని కి పొంగల్లు సమర్పించారు. రాజధాని తరలకుండా చూడాలని వేడుకున్నారు.

రాజధాని మార్పు నిర్ణయాన్ని ముక్తకంఠంతో ఖండించారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అమరావతి కి మద్దతుగా నినాదాలు చేశారు ప్రభుత్వంకి , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదేశించారు.. రాజధాని అమరావతి కోసం తమ ప్రాణాలను అర్పిస్తామని రైతులు పేర్కొన్నారు.. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకొమని చెప్పారు.మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు

Conclusion:AP_GNT_71_04_RAJADHANI_RAITULA_ANDOLANA_RALLY_AV_AP10115
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.