Amaravati: విభజన చట్టం ప్రకారం 2015లోనే ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్రం నోటీఫై చేసిందని.. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో స్పష్టత ఇవ్వడాన్ని రాజధాని రైతులు స్వాగతించారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం మూడన్నరేళ్లు అభివృద్ధి చేయకుండా.. కాలయాపన చేసిందని రైతులు విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎంతో మంది రైతులను రోడ్డు పాలు చేశారని.. వారికి ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.
త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగుతోందని ఇటీవలే సీఎం ప్రకటన చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం ఇచ్చిన సమాధానం రాజధాని ప్రాంత రైతులకు ఊరటనిస్తోందని అమరావతి ఐకాస నాయకులు అన్నారు. త్వరలో ప్రధానే స్వయంగా రాజధాని అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలిపారు. విశాఖకు రాజధాని తరలింపు అనేది జరగని పని అని... ప్రభుత్వం ఇప్పటికైన కళ్లు తెరిచి రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: