గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గుట్లాపల్లి గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు మారం శ్రీనివాసరెడ్డి విద్యుతాఘాతంతో మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి మోటరు స్టాటర్ రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనీల్ కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి: 'విద్య, వైద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది'