దొంగ నోట్లు అచ్చేసి..దొరికిపోయారు! గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు నకిలీ నోట్లు ముద్రించే ముఠాను అరెస్ట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సురేష్, సీతారామయ్య మరో ముగ్గురిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి..రిమాండ్కు తరలించారు. నిందితులు 200 నోటులోని ఆర్బీఐ త్రెడ్ను, గాంధీ బొమ్మలు సేకరించి నకిలీ 2వేల నోటులో అమర్చి చలామణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి వ్యాపారి అందించిన సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి...రూపాయికి 8 రూపాయలంటూ... ఘరానా మోసం